Home ఖమ్మం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన పువ్వాడ

కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన పువ్వాడ

Minister Puvvada Ajay Kumar Comments on CM KCRఖమ్మం : సిఎం కెసిఆర్ చిత్రపటానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం క్షీరాభిషేకం  చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొ్న్నాయని, అయినప్పటికీ కెసిఆర్ రైతులకు అండగా నిలబడ్డారని పువ్వాడ కొనియాడారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని కోయచలక గ్రామంలో పువ్వాడ రైతులతో మాట్లాడారు. రైతుబంధు పథకం కింద ఒక్క రోజే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో వానకాలం పంట సాయం కింద జమ చేయడం కెసిఆర్ తో మాత్రమే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.5,294 కోట్ల రైతుబంధు డబ్బులు జమ చేసిన ఘనత  తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు.