Home తాజా వార్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ

Puvvada Ajay Kumarతిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి  శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పువ్వాడకు వేద పండితులు ఆశీర్వచంన, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించి శ్రీవారి శేష వస్త్రాలతో సత్కరించారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన సిఎం కెసిఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రిగా చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రవాణా శాఖలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Minister Puvvada Ajay Kumar Visits Tirumala Temple