Home ఖమ్మం అన్ని వర్గాల సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం : పువ్వాడ

అన్ని వర్గాల సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం : పువ్వాడ

Minister Puvvada Comments On CM KCRఖమ్మం : సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ పాలన చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో సోమవారం ఆయన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుపేద వర్గాలకు చెందిన యవతులకు పెళ్లి కానుక అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో   ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టిఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ , ఆర్డీవో రవీంద్రనాథ్, తహశీల్దార్లు శ్రీనివాసరావు, నర్సింహారావు కార్పొరేటర్లు, పలువురు టిఆర్ఎస్  నాయకులు పాల్గొన్నారు.