Home ఖమ్మం ప్రభుత్వ ఆసుప్రతిలో సిటి స్కాన్ సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ప్రభుత్వ ఆసుప్రతిలో సిటి స్కాన్ సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Minister Puvvada launches CT scan services at govt hospital

 

ఖమ్మం: ప్రభుత్వ దవాఖానలో సిటి స్కాన్ సేవలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎంఆర్ఐ, సిటిస్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రులు పేదోడి వైద్యానికి భరోసాగా మారాయని మంత్రి తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ విభాగాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావడం ప్రజల అదృష్టమని, రాష్ట్రంలో అత్యధిక కెసిఆర్ కిట్లు అందించిన ఆసుపత్రిగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నిలిచిందని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో ఖమ్మం సర్కార్ దవాఖాని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు.

Minister Puvvada launches CT scan services at govt hospital