Tuesday, April 23, 2024

ట్విట్టర్ వివాదంపై ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

minister ravi shankar prasad comments on twitter

న్యూఢిల్లీ: ట్విట్టర్ వివాదంపై కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం ఘాటుగా స్పందించారు. కొత్త ఐటి చట్టం అమలుకు ట్విట్టర్ కు తగినంత సమయమిచ్చామని చెప్పారు. మూడు నెలలు సమయమిచ్చినా.. ట్విట్టర్ స్పందించలేదని రవిశంకర్ ప్రసాద్ పైర్ అయ్యారు. ఇతర సంస్థలు ఐటి చట్టాన్ని పాటిస్తుంటే ట్విట్టర్ కు అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. ముగ్గురు అధికారులను నియమించాలని ట్విట్టర్ కు అడిగామని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. భారత్ సంస్థలు అమెరికాలో నిబంధనలు పాటిస్తున్నాయి… భారత్ లో నిబంధనలు పాటించడంలో వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలన్నారు. భారత్ లో వ్యాపారం చేయాలంటే నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. ప్రధానిని విమర్శించినా స్వాగతిస్తాం.. నిబంధనలు మాత్రం తప్పనిసరి అని రవిశంకర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News