Wednesday, November 30, 2022

వికారాబాద్ డెంటల్ ఆసుపత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం

- Advertisement -

Minister sabitha helps accident victim in vikarabad

 

కారు ఆపి క్షతగాత్రులకు చేయూతనిచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ : వికారాబాద్ డెంటల్ ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని షిప్ట్ కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఉద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. అదే సమయంలో వికారాబాద్‌లో సమావేశాన్ని ముగించుకొని హైదరాబాద్ వెళుతున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి తన కారును ఆపి ప్రమాదానికి గురైన క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను పరిశీలించి తన కాన్వాయ్‌లోని పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఆదేశాలతో పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

Minister sabitha helps accident victim in vikarabad

Related Articles

- Advertisement -

Latest Articles