Home తాజా వార్తలు మానవత్వం చాటిన మంత్రి సబితారెడ్డి…

మానవత్వం చాటిన మంత్రి సబితారెడ్డి…

sabitha-indra-reddyరంగారెడ్డి: మంత్రి సబితారెడ్డి మానవత్వం చాటుకుంది. రోడ్డుపై ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించి పక్క నుంచి వెళ్లిపోకుండా కాన్వాయ్‌ను నిలిపి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపడంతో పాటు కాన్వాయ్‌లో ఉన్న ఎస్‌ఐని వారి వెంట పంపించి మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకున్నారు. ఇంద్రారెడ్డి జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల, కౌకుంట్ల గ్రామాల్లో ఘనంగా నివాళులర్పించి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల మలుపు వద్ద కారు, బైక్ ఢీకొని వ్యక్తి కాలు నుజ్జు నుజ్జు అయి రోడ్డుపైన ఉండటాన్ని గమనించిన సబితారెడ్డి కాన్వాయ్‌ను ఆపించింది. అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించి కాన్వాయ్‌లో ఉన్న ఎస్‌ఐ రేణుక రెడ్డిని క్షతగాత్రులతో పాటు పంపించింది. కాలు విరిగిన వ్యక్తి వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులతో పాటు దామరగిద్ద సర్పంచ్ వెంకటేశం గుప్తకు సమాచారం ఇప్పించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

minister Sabitha Indra Reddy Help to Injured Person