Friday, March 29, 2024

ఫస్టియర్ పరీక్షలకు 1768 కేంద్రాలు

- Advertisement -
- Advertisement -
Minister Sabitha Review On Intermediate Exam
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా 25 నుంచి 3 వరకు ఇంటర్ పరీక్షలు, 1,768 పరీక్షలు కేంద్రాలు.. ఐసోలేషన్ గదుల ఏర్పాటు,  విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

మనతెలంగాణ/హైదరాబాద్: కొవిడ్ నిబంధనలకు అ నుగుణంగా ఈ నెల 25 నవంబర్ 3 వరకు ఇంట ర్ ప్రథమ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప రీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రా ష్ట్ర వ్యాప్తంగా 1,768 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశా మని, 4,59,228 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఏర్పాట్లపై గురువారం ఇంటర్ బో ర్డు కార్యాలయం నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయానికి లోను కాకుండా ఆత్మ విశ్వా సంతో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

పరీక్ష లను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ఇప్పటికే జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు, హై పవర్ కమిటీలను ఏర్పాటు చేశామని పే ర్కొన్నారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ, వి ద్యుత్ శాఖ, జిల్లా విద్యా శాఖాధికారి, జిల్లా పోస్టల్ అధి కారులతో కలిపి జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహించాలని మంత్రి అధికా రులను ఆదేశించారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిన వారిని మాత్రమే పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా, డి పార్ట్మెంటల్ అధికారులుగా, చీఫ్ సూపరింటెండెంట్లుగా, క్లర్కులుగా, అటెండర్లుగా నియమించడం జరుగుతుం దని తెలిపారు.

గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి

పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందు నుంచే అ నుమతించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్ల డించారు. పరీక్షా కేంద్రాల్లో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రా లకు చేరేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్ టిసి అధికారులను మంత్రి ఆదేశించారు. పరీక్షలను పా రదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా ప్రతీ పరీక్షా కేంద్రంలో సిసి కెమరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. నూతనంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన పాఠశాలల్లో కూడా గురువారం సాయంత్రానికి సిసి కెమె రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించా రు. విద్యార్థులు తీసుకువచ్చే మంచినీటి బాటిళ్లు, శానిటై జర్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.

పరీక్ష నిర్వహణకు ముందు, తర్వాత బేంచీలు, డ్యూయ ల్ డెస్కలు, డోర్లు, విండోలను తప్పనిసరిగా సానిటైజ్ చే యాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతీ విద్యార్థిని థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రంలోకి మాస్కులు ధరించిన విద్యార్థులు, సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని మం త్రి స్పష్టం చేశారు. మొదటి సంవత్సరం పరీక్ష ప్రశ్నాప త్రం 70 శాతం సిలబస్‌కే రూపొందించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన సిలబస్‌ను ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు. ప్రశ్నాపత్రాల్లో చాయిస్ కూడా పెంచామని, ప్రతీ సబ్జెక్టుకు సంబంధించిన మోడ ల్ ప్రశ్నా పత్రాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యాలు సహకరించాలని, పరీక్షల సమయంలో ఇబ్బందులు పెట్టొద్దని అన్నారు. ఈ సమావేశంలో వి ద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News