Tuesday, April 16, 2024

ఒకటో తేదీ నాటికి పాఠశాలలను పూర్తిగా సిద్ధం చేయాలి

- Advertisement -
- Advertisement -
Minister sabitha sudden inspection at Mahabubia Girls School
పాఠశాలల్లో అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
మహబూబియా బాలికల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకటో తేదీ వరకు పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు పూర్తి చేయాలన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని గన్‌ఫౌండ్రీ మహబూబియా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా కమిషనర్ దేవసేనలతో కలిసి మంత్రి పాఠశాలను పరిశీలించారు. మహబూబియా పాఠశాల పరిసరాలను పరిశీలించి, పచ్చదనం, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఆలోచించి, చర్చించి పాఠశాలల ప్రారంభానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎంఎల్‌ఎలు, ఎంపిలు, జెడ్‌పి ఛైర్మన్‌లు ఇతర ప్రజా ప్రతినిధులకు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. అన్ని చోట్లా ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారని, ఇదే స్ఫూర్తి ముందు కూడా కొనసాగలన్నారు.

గ్రామ పంచాయతీల పరిధుల్లో సర్పంచ్‌లు,ఎంపిటిసిలు మండల స్థాయిలో ఎంపిపి,జెడ్‌పిటిసిలు,మున్సిపాలిటీల్లో ఛైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేషన్‌లలో మేయర్, కార్పొరేటర్లు పాఠశాలలను సందర్శించి,వసతులు ఇతరత్రా వాటిని పరిశీలించాలని అన్నారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులను ఉపాధ్యాయులు నిశితంగా గమనించాలని సూచించారు. జ్వరం, ఇతర లక్షణాలు ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వైరల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శానిటైజేషన్ పనులను పరిశీలించి మంత్రి పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు, విద్యుత్, సదుపాయాలపై అరా తీసారు. మరుగుదొడ్లను పరిశీలించి,క్లినింగ్‌పై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. నీటి ట్యాంక్‌లను శుభ్రం చేయాలని,బ్లీచింగ్ పౌడర్‌ను వేదజల్లాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో పనులు చేపట్టాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలు ట్రాన్స్‌పోర్ట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని,బస్‌లను శానిటైజేషన్ చేయాలని తెలిపారు. చాలా రోజుల తర్వాత పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో ఒకటో తేదీ నుండి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు వాతావరణం అలవాటు పడేలా చూసే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News