Wednesday, April 24, 2024

ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఆదివారాన్ని ఆహ్లాద వారంగా మార్చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. సీజనల్ వ్యాధుల ప్రబలకుండా అందరూ సహకరించాలని రాష్ట్ర ఐటి కె.టి.రామారావు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వానాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులతో పాటు జీవించే వాతావరణాన్ని ఇవ్వడం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించిన హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్ద, ఆవరణలో, కార్యాలయాల్లో మొక్కలు నాటాలని కోరారు. ఆరవ విడత హరితహారాన్ని విజయవంతం చేయాలని అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు.

Minister Satyavathi Rathod cleaning her house premises

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News