Home తాజా వార్తలు టిఆర్ఎస్ విజయం కోసం కృషి చేయాలి : సత్యవతి రాథోడ్

టిఆర్ఎస్ విజయం కోసం కృషి చేయాలి : సత్యవతి రాథోడ్

Minister Satyavathi Rathod Election Campaign in Warangalవరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని మంత్రి సత్యవతి రాథోఢ్ కోరారు. మంత్రి సత్యవతి వరంగల్ పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోరే అధికార టిఆర్ఎస్ కు మాత్రమే ఓటేయాలని ఆమ పట్టణ ప్రజలను కోరారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఓటేయడం వల్ల ఎటువంటి లాభం చేకూరదని ఆమె పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కనిపించే బిజెపి, కాంగ్రెస్ నాయకులకు గట్టిగణపాఠం చెప్పాలని ఆమె పట్టణ ప్రజలను కోరారు. కులమతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆమె స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నది ఒక్క కెసిఆర్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.