Home తాజా వార్తలు మహిళల రక్షణకు చర్యలు : సత్యవతి రాథోడ్

మహిళల రక్షణకు చర్యలు : సత్యవతి రాథోడ్

Minister Satyavathi Rathod Speech In TRS Plenaryహైద‌రాబాద్ : తెలంగాణలో మహిళల రక్షణకు, వారి సంక్షేమానికి సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. టిఆర్ఎస్ ప్లీన‌రీలో సంక్షేమ తెలంగాణ సాకారంపై ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ బ‌ల‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆమె  మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూస్తూ సిఎం కెసిఆర్ పాలన చేస్తున్నారని ఆమె కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని ఆమె చెప్పారు. మ‌హిళ‌ల సంక్షేమం, భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆమె పేర్కొన్నారు. సమైక్య పాలనలో మహిళఅలకు రూ.4.50 కోట్లు కెటాయిస్తే, తెలంగాణ వచ్చాక కెసిఆర్ పాలనలో రూ.10 వేల కోట్లు కేటాయించారని ఆమె తెలిపారు. నిరుపేద మహిళల కోసం కెసిఆర్ క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్, ఆరోగ్య‌ల‌క్ష్మి, కెసిఆర్ కిట్ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.  ఒంట‌రి మ‌హిళలకు పెన్ష‌న్లు, వితంతు పెన్ష‌న్లు అమ‌లు చేస్తున్నారని ఆమె కొనియాడారు.  క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్  ప‌థ‌కాలతో రాష్ట్రంలో బాల్య వివాహాలు త‌గ్గిపోయాయని ఆమె చెప్పారు. నిరుపేద పిల్లలకు పౌష్టికాహారం అందించే క్రమంలో  అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల నుంచి బాలామృతంతో పాటు కోడిగుడ్లు అందిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.  అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌కు, ఆయాల‌కు జీతాలు పెంచి గౌర‌వించుకున్నామ‌ని మంత్రి సత్యవతి వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీటీమ్స్ ను ఏర్పాటు చేశామని ఆమె స్పష్టం చేశారు.