Home తాజా వార్తలు కుమ్రం భీం ఆశయాలను సాధించాలి : సత్యవతి రాథోడ్

కుమ్రం భీం ఆశయాలను సాధించాలి : సత్యవతి రాథోడ్

Minister Satyavathi Rathod Tributes To Komaram Bheemహైదరాబాద్‌: ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కుమ్రం భీం ఆశయాలను సాధించాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.  జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆయన ఉద్యమించారని ఆమె కొనియాడారు. కుమ్రం భీం జయంతి సందర్భంగా శుక్రవారం సత్యవతి రాథోడ్ ఆయనకు నివాళులు అర్పించారు. పసిప్రాయం నుంచే కుమ్రం భీం ప్రజల హక్కుల కోసం ఉద్యమించారని ఆమె తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు సాగి ప్రజల బానిస సంకెళ్లను తెంచేందుకు ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారని ఆమె కొనియాడారు. ఈ క్రమంలోనే కుమ్రం భీం జయంతి, వర్ధంతిలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని సత్యవతి చెప్పారు. ’ మా తండా… మారాజ్యం‘ నినాదాన్ని సిఎం కెసిఆర్ సాకారం చేశారని ఆమె పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న డిమాండ్ ను సిఎం కెసిఆర్ పరిష్కరించారని ఆమె తెలిపారు. పాలనలో గిరిజనులను భాగస్వాములను చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని ఆమె తేల్చిచెప్పారు. కుమ్రం భీం జయంతిని పురస్కరించుకుని గిరిజనుల పురోభివృద్ధికి పాటుపడుతామని ఆమె పేర్కొన్నారు. కుమ్రం భీం కొట్లాడిన పోరుగడ్డ జోడే ఘాట్ లో 25 కోట్లతో కుమ్రం భీం స్మారక చిహ్నం, ఆయన స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియ జేసే గొప్ప ఉద్యమ కేంద్రంగా తయారు చేశామన్నారు. జోడే ఘాట్ లో సిఎం కెసిఆర్ అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ప్రగతి పథంలో నిలిపారని ఆమె కొనియాడారు. హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో ఆదివాసీల ఆత్మగౌరవం నిలిపేలా 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో కుమ్రం భీం ఆదివాసీ భవన్ నిర్మాణం చేశారని ఆమె వెల్లడించారు.