Wednesday, April 17, 2024

పరవళ్లు తొక్కుతున్న పచ్చదనం

- Advertisement -
- Advertisement -

Minister Satyavathi Rathod who planted plants

 

పుట్టినరోజు మొక్కలునాటి సవాల్ విసిరిన మంత్రి సత్యవతి రాథోడ్

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ స్వీకరించి తనపుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ మొక్కలు నాటారు. శనివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని శనిగాపురం అంగన్‌వాడీ కేంద్రంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ హరిత తెలంగాణగా మార్చే సిఎం లక్షంలో భాగంగా ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఎంతో ఉన్నతమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రం పచ్చదనంతో పరవళ్లు తొక్కుతుందన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా, మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేకకార్యదర్శి దివ్య, ఎస్‌టి, ఎస్‌సి గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు మంత్రి సత్యవతి రాథోడ్ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు.

ఎంపి సంతోష్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకుని రెబల్‌స్టార్ బాహుబలి ప్రభాస్ అడవిని దత్తతతీసుకుని మొక్కలు నాటుతుంటే రెబల్‌స్టార్‌ను ఆయన అభిమానులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. బెంగుళూరు పట్టణంలోని డైరీ సర్కిల్ దగ్గర ఉన్న ప్రభుత్వ కిడ్వాయి క్యాన్సర్ ఆసుపత్రి లోని ఖాళీ ప్రదేశంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్‌కర్ణాటక(పిఎఫ్‌ఎకె) ఔషధ మొక్కలు నాటారు. క్యాన్సర్ ఆసుపత్రిలోని పదివేల చదరపు గజాల స్థలాన్ని దత్తత తీసుకుని క్యాన్సర్ రోగులకు ఆక్సిజన్ అందించే 180 రకాల ఔషధ మొక్కలు నాటుతున్నట్లు పిఎఫ్‌ఎకె అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి చెప్పారు. ఆసుపత్రి ఖాళీ ప్రదేశంలో ఔషధ మొక్కల అడవిని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.

ఈకార్యక్రమంలో పిఎఫ్‌ఎకె కార్యదర్శి అశిక్ ఆసుపత్రి పిఆర్‌ఒ బసప్ప, ఇండియన్ హెర్బ్ ఫౌండర్ రవీంద్ర పాల్గొన్నారు. ఆర్టిస్టు హరిత ఇచ్చిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఆర్టిస్ట్ అమృత ప్రిన్సి నానక్ రామ్‌గూడలో మొక్కలు నాటారు. అనంతరం ఆర్టిస్టులు అనుశ్రీ, ప్రియాంక, మౌనికలకు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి జగిత్యాల ఎస్‌పి సింధు శర్మ తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం కరీంనగర్ జిల్లాకలెక్టర్ శశాంక, జగిత్యాల కలెక్టర్ రవి, సిరిసిల్ల ఎస్‌పి రాహుల్ హెగ్డేకు ఎస్‌పి సింధూశర్మ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News