Home తాజా వార్తలు హుజుర్ నగర్ లో జోరుగా సత్యవతి ప్రచారం

హుజుర్ నగర్ లో జోరుగా సత్యవతి ప్రచారం

Minister Satyavatiసూర్యాపేట : హుజర్ నగర్ అసెంబ్లీకి ఈనెల 21న ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ప్రచారంలో టిఆర్ఎస్ దూకుడు పెంచింది. రాష్ట్రమంత్రి సత్యవతి రాథోడ్ ఈ నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఆమె నేరేడుచర్ల మండల పరిధిలోని పలు గిరిజన తండాల్లో పర్యటించారు. గిరిజన తండాలన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. గిరిజనులు టిఆర్ఎస్ ను బలపర్చి , కారు గుర్తుకే ఓటేయాలని ఆమె కోరారు. గిరిజన తండాల్లో మౌలిక వసతులు కలిపిస్తామని ఆమె హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. టిఆర్ఎస్ కు ఓటేస్తామని నియోజకవర్గ పరిధిలోని అన్ని గిరిజనతండాలు తీర్మానం చేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. హుజుర్ నగర్ లో టిఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆమె తేల్చి చెప్పారు. ఈ ఉప ఎన్నికకు కారణమైన టిపిసిసి చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలను కోరారు.

Minister Satyavati Election Campaign in HuzurNagar