Home తాజా వార్తలు బిసిల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

బిసిల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud Comments On BCsహైద‌రాబాద్ : తెలంగాణలో బిసిల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ పాలన చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్లీన‌రీలో సంక్షేమ తెలంగాణ సాకారంపై ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాల‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బ‌ల‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి పథంలో సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని, తెలంగాణ వచ్చాక, కెసిఆర్ పాలనలో వాటికి పునర్ వైభవం తెచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాలకు కెసిఆర్ సమ ప్రాధాన్యత ఇస్తూ, వారిని ఆర్థికంగా, సామాజికంగా చైతన్యం చేశారని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. తెలంగాణ గురుకులాల్లో చ‌దివిన విద్యార్థులు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి యూనివ‌ర్సిటీల్లో చ‌దువుతున్నారని ఆయన చెప్పారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బిసిలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని , అయితే రాష్ట్రంలో మాత్రం వారి అభివృద్ధికి కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు.