Friday, March 29, 2024

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -
Minister srinivas goud distributed cmrf cheques
= రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు, సాంకేతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 24 మంది లబ్ధ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద రూ.10 లక్షల 18వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు. గతంలో పేదలు అనారోగ్యం పాలైతే ఆస్తులు కుదువ పెట్టి వైద్యం చేయించుకునే వారని అలాంటిది ఇప్పుడు ప్రభుత్వమే ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తుందని అంతేకాక ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి కూడా డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

ఆసారా పింఛన్లు ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం, ఉచిత విద్యుత్, విద్యార్థులకు హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం అందజేస్తున్నామని రాష్ట్రంలో సుమారు 1000 ఎస్టీ, ఎస్సీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. పేద ప్రజలు ప్రత్యేకించి రైతులు చాలా సంతోషంగా ఉన్నారని గ్రామాలలో రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు పెట్టుబడి సబ్సీడి ఎరువులు, విత్తనాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కరోనా సమయలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకార్యలు కల్పించామని అంతేకాక అవసరమైన మందులు, ఇంజక్షన్లు, కూడా అందుబాటులో ఉంచి ఆదుకోవడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ చైర్మెన్ కెసి నరసింహులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News