Thursday, April 25, 2024

జూలూరి గౌరీశంకర్‌ను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Gowd congratulated Zulur Gaurishankar

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : రవీంద్రభారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరి శంకర్ బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్‌లు గౌరీశంకర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా జూలూరీ గౌరీశంకర్ మాట్లాడుతూ సాహిత్యరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విశిష్టతను పుస్తకరూపంలో తీసుకొస్తానని గౌరీశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రదాయాలు, కళల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అణగదొక్కబడిన వారికి స్వరాష్ట్రంలో ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. ఉద్యమకారులకు అవకాశాలు వస్తాయని సమన్వయంతో ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News