Saturday, April 20, 2024

బోనాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Yadav inspected bonalu arrangements

హైదరాబాద్: బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ,మత్య,పాడిపరిశ్రమల అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ నెల 25న సికింద్రాబాద్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాంకాళిఅమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై శుక్రవారం మంత్రి వివిధ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని నగరం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారన్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.ప్రధానంగా దర్శన సమయంలో భక్తులు ఎలాంటి తోపులాటలకు గురికాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా వాటర్ వర్స్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఆలయ పరిసరాలకు వచ్చే రహదారులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న మంత్రి ట్రాఫిక్ డైవర్షన్‌కు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అదనపు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. భక్తులకు అధికారులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, కార్పోరేటర్ సుచిత్ర,మాజీ కార్పోరేటర్ అత్తిలి అరుణ గౌడ్, నార్త్‌జోన్ డీసీపి కమలేశ్వర్, ఏసీపీలు రమేష్, వినోద్‌కుమార్ ,సిఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News