Home తాజా వార్తలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి : తలసాని

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి : తలసాని

TALASANI-

జనగామ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా ఆని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉనికి కోసమే ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మరికొద్ది కాలంలో తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణగా మారనుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, వారిని ప్రజలు నమ్మరని తలసాని స్పష్టం చేశారు.

Minister Talasani Comments on Congress