Home తాజా వార్తలు విజయ డెయిరీ విస్తరణకు కృషి : తలసాని

విజయ డెయిరీ విస్తరణకు కృషి : తలసాని

Minister Talasaniహైదరాబాద్ : తెలంగాణలో విజయ డెయిరీ విస్తరణకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి తలసాని అసెంబ్లీలో మాట్లాడారు. డెయిరీ పాలతో పాటు పలు ఉత్పత్తులకు ఔటులెట్లు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పాడి రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. సహకార రంగంలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ప్రైవేటు డెయిరీలను కూడా ప్రోత్సహిస్తామని ఆయన స్పష్టం చేశారు. డెయిరీలను ప్రోత్సాహించేందుకు బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించినట్లు  తలసాని పేర్కొన్నారు.

Minister Talasani Comments On Vijaya Dairy