Saturday, April 20, 2024

అన్ని జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరవాలి

- Advertisement -
- Advertisement -

Minister Talasani held meeting with educational institutions

ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలి
విద్యార్దులకు మాస్కు, శానిటైజన్ అందుబాటులో ఉంచాలి
తల్లిదండ్రుల నుంచి తప్పక డిక్లరేషన్ తీసుకోవాలి
ప్రతి పాఠశాల్లో ఒక ఐసోలేషన్ గది ఏర్పాటు చేయాలి
విద్యాసంస్దల నిర్వహకుల సమావేశంలో మంత్రి తలసాని సూచనలు

హైదరాబాద్: నగరంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాతే విద్యా సంస్దలను తెరిచే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్దక,మత్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9,10 తరగతుల, ఇంటర్, డిగ్రీ తరగతుల నిర్వహణ కోసం విద్యా సంస్దలను తెరవాలని ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంతో బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్దల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్దలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, పాఠశాలల నిర్వహకులు కూడా ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని ఆదేశించారు. విద్యార్దుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని, ఖచ్చితంగా విద్యార్దులు మాస్కులు ధరించేలా చూడాలని, శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాలన్నారు.

అదే విధంగా తరగతి గదిలో విద్యార్దులు కనీసం దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని, మరుగుదొడ్లు ఎప్పడు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్దుల తల్లిదండ్రుల నుండి తప్పనిసరిగా డిక్లరేషన్ తీసుకోవాలని, ప్రతి పాఠశాలలో ఒక గదిని ఐసోలేషన్ కోసం కేటాయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో కూడా శానిటైజేషన్ చేపట్టాలన్నారు. ఈవిషయంలో ఏఐఈ విద్యాశాఖ అదికారులు సమన్వయంతో వ్యవహారించాలని ఆదేశించారు. విద్యార్దుల తల్లిదండ్రులకు ఉన్న అనుమానాలను నివృతి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. విద్యార్దుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత విద్యాసంస్దల నిర్వహకులపై ఉందన్నారు. ఈసందర్భంగా పలు విద్యా సంస్దలకు చెందిన ప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానూకూలంగా స్పందించారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు ఉన్నాయని, సకాలంలో నిధులు రాని కారణంగా బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రికి వివరించారు. సమావేశం అనంతరం ట్రాన్స్‌కో ఎండీ రఘమారెడ్డితో మంత్రి ఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వ విద్యా సంస్దలలో విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్దరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే విధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్దితులు రాకుండా చూడాలని చెప్పారు.

సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా 9నెలల నుంచి విద్యా సంస్దలు మూసివేయడం జరిగిందని, అయినప్పటికి విద్యార్దులను ఆన్‌లైన్ ద్వారా తరగతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. పాఠశాలను తెరిచి వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిర్వహణను పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.అనంతరం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రసంగిస్తూ ఈసమావేశం చాలా ముఖ్యమైనదని అంబులెన్సు ఏర్పాటు చేస్తామని తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని పాఠశాలలు ప్రారంభించడానికి ముందే వాటిని పరిశీలించి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.పాఠశాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. విద్యార్దులకు టెంపరేచర్ టెస్టుల చేయాలని , మాస్కులు ధరించేలా, శానిటైజర్ వినియోగించేలా చూడాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి, అదనపు కమిషనర్ సంతోష్, విద్యాధికారి రోహిణి, ఇంటర్‌బోర్డు అధికారి జయప్రద తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News