Friday, April 26, 2024

వినాయక ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

Minister Talasani review on Vinayaka Chavithi arrangements

ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏరాట్లపై సమిక్ష
ఈ ఏడాది 6 లక్షల మట్టి ప్రతిమల పంపిణీ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: ఈ ఏడాది వివాయక ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్లు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈనెల 31 నుంచి వినాయక చవితి పండుగ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై మంగళవారం ఎంసిహెచ్‌ఆర్‌డి లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమీక్షసమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీపభాకర్ రావు, ఎమ్మెల్యేదానం నాగేందర్, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు, హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తా, అదనపు డిజిపి జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ నీతూకుమారి ప్రసాద్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్,పోలీస్ కమిషనర్ లు సి.వి. ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ రఘోత్తంరెడ్డి, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కి చెందిన నిరంజన్ రెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సుదర్శన్, సికింద్రాబాద్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శీలం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఏడాది 6లక్షల మట్టి వినాయకుల పంపిణీ: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

వినాయక చవితి పురస్కరించుకుని ఈ ఏడాది ప్రభుత్వం తరుపున భారీగా ఏర్పాట్లును చేయడమే కాకుండా పర్యవరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా 6 లక్షల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో 4 లక్షలు, పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక లక్ష, హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో ఒక లక్ష చొప్పున మొత్తం 6 లక్షల విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ లో ప్రతి ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని ఇందుకు తగట్లుగానే ప్రభుత్వ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తోందని చెప్పారు. ఉత్సవాల సందర్బంగా భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్ గణనాధుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి ఏలాంటి ఇబ్బందులు కల్గకుండ ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో భారికేడ్ లను ఏర్పాటు చేస్తున్న ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

ఈ నెల 24 వ తేదీన అధికారులతో కలిసి ఖైరతాబాద్ వినాయక మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల నిమజ్జనం కోసం ఈ ఏడాది నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 25 పాండ్స్ కు అదనంగా మరో 50 పాండ్స్ ను ఏర్పాటు చేస్తున్నమన్నారు. వినాయక శోభ యాత్ర సాగే రహదారులలో అవసరమైన చోట్ల మరమ్మతులతో పాటు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో క్రేన్ లు, లైటింగ్, జనరేటర్ లు, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి మండపం వద్ద జిహెచ్‌ఎంసి సిబ్బంది పారిశుధ్య పనులను నిర్వహించడంతో పాటు సెప్టెంబర్ 9 వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం రోజున 8 వేల మంది జిహెచ్‌ఎంసి సిబ్బంది మూడు షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. శోభయాత సందర్భంగా అవసరమైన ప్రాంతాలలో ట్రాపిక్ డైవర్షన్ ఉంటుందని, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బంది ని నిమయమించడం తో పాటు మఫ్టీ, షీ టీం లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అందరు జాతీయ గీతాన్ని ఆలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News