Wednesday, April 24, 2024

గొర్రెల పెంపకంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani review with Animal Husbandry Officers

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం అన్ని జిల్లాల పశు వైద్యాధికారులు, పశు సంవర్ధక అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. గొర్రెల పెంపకం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీతో 6500 కోట్ల సంపద సృష్టించబడిందని చెప్పారు. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.6వేల కోట్లు విడుదల చేసిందన్నారు.పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుండి రూ.1.75 లక్షలకు సిఎం కెసిఆర్ పెంచారని తెలిపారు. ధనవంతులైన గొల్ల, కురుమలకు అడ్రస్ గా తెలంగాణ నిల్వనుందని చెప్పారు. పశుగ్రాసం కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో గొర్రెల మార్కెట్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దశల వారిగా పశు వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలులో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది కృషి ఎనలేనిదని మంత్రి కొనియాడారు.

Minister Talasani review with Animal Husbandry Officers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News