Home తాజా వార్తలు హెచ్‌ఎండిఎ పరిధిలో హరితహారం: తలసాని

హెచ్‌ఎండిఎ పరిధిలో హరితహారం: తలసాని

TALASANIహైదరాబాద్: ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ… సోమవారం హెచ్‌ఎండిఎ పరిధిలో హరితహారం కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. కరువును తరిమికొట్టాలంటే పెద్ద ఎత్తున మొక్కలను నాటాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ హరితహారంలో భాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు.