Home తాజా వార్తలు వివాదంలో ‘మహర్షి’…

వివాదంలో ‘మహర్షి’…

Talasani and Maharshiహైదరాబాద్‌: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్‌, పివిపిలు భారీ బడ్జెట్‌తో నిర్మించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. గురువారం విడుదలకు సిద్ధమైన ‘మహర్షి’ మూవీ తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఎక్స్‌ ట్రా షోస్‌తో పాటు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుతం అనుమతి ఇచ్చిందంటూ చిత్రయూనిట్ ప్రకటించటంపై సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. టికెట్‌ రేట్ల పెంపుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే చిత్ర బృందం టికెట్‌ రేట్ల పెంచడంపై మంత్రి ఫైర్ అయ్యారు. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, కానీ కోర్టు మార్గదర్శకంలో నిన్న కొన్ని థియేటర్ యాజమాన్యాలు వాళ్లంతట వాళ్లే రేట్లు పెంచుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. ఇలా టికెట్ రేట్లు పెంచిన జాబితాలో 79 థియేటర్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు తెలిపారు.

Minister Talasani Serious on Maharshi Movie Ticket Hikes Issue