Wednesday, April 24, 2024

తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కేంద్ర సంస్థలు చేస్తున్న దాడులను ఎదుర్కొంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సిఎం ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు వ్యవస్థలు మీ చేతిలో ఉండొచ్చు, రేపు మా చేతిలో ఉండొచ్చు అని మంత్రి సూచించారు. లక్ష్యం చేసుకుని దాడులు చేయడం సరికాదని మంత్రి హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదని మంత్రి తలసాని తేల్చిచెప్పారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కొవాలని చెప్పారు.

దేశ చరిత్రలో ఇలాంటి విధానాలు ఎప్పుడూ చూడలేదన్నారు. లక్ష్యంగా చేస్తున్న దాడులకు టిఆర్ఎస్ నాయకత్వం భయపడదని తలసాని స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రజలను చైతన్యం చేసి మేం ఏంటనేది వ్యవస్థలకు చూపిస్తామని చెప్పారు. అంత భయపడితే హైదరాబాద్ లో ఎందుకు ఉంటామన్నారు. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూస్తారని మంత్రి వివరించారు. ఈ నెల 27న టిఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామన్నారు. 15 నియోజకవర్గాలకు చెందిన ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరుపుతామని చెప్పారు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News