Home తాజా వార్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తలసాని

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తలసాని

Minister Talasani

 

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుతలో కలిసి తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనర్ధం తిరుమలకు వచ్చిన ఆయన విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ అధికారులు శేష వస్త్రం కప్పి మంత్రి తలసానికి తీర్ధ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంద్ర, తెలంగాణ అన్నపూర్ణ లాంటి రాష్ట్రాలని కలిసి నీరు, విద్యుత్ కష్ట్రాలను గట్టేకించి రైతంగాని కపాడుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాగే పరస్పరం సహకారించుకొవాలని మంత్రి తలసాని అన్నారు.

తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకారించుకుంటూ అభివృద్ధి దిశగా అడ్డుగులు వేయాలని శ్రీవారి కోరుకున్నట్టుగా మంత్రి తెలిపారు. ఆంద్రప్రదేశ్ లో కోలుతిరిన కోత్త ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రాధన్యతలను స్థిర పర్చుకొనేందుకు మరో ఆరు నెలల సమయం పడుతుందన్నారు.  ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం తగదన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లోనే వుందని.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణలు జరగతావున్నాయని తలసాని తెలిపారు.

Minister Talasani Srinivas Yadav visits Tirumala