Tuesday, March 21, 2023

పసి హృదయానికి మంత్రి చేయూత

- Advertisement -

harish

*పసివాడి గుండె శస్త్ర చికిత్సకు మంత్రి ఆర్థిక సహాయం
*విజయవంతంగా ముగిసిన గుండె ఆపరేషన్
*పేద కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందం
*మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ జన హృదయాలను గెలుచుకున్న మంత్రి హరీశ్‌రావు ఒక పేద కుటుంబానికి అండగా నిలచి పసి ప్రాణాన్ని కాపాడారు. తనదైన రీతిలో స్పందించడమే కాకుండా శస్త్ర చికిత్సకు అవసరమైన ఆరు లక్షల రూపాయలు సహాయం చేసి జన హృదయ బాంధవుడిగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. సిద్దిపేట మండలం వెల్కటూరు గ్రామానికి చెందిన పుట్ట ఉమారాణి, సతీష్ దంపతులకు గత నెలలో బాబు జన్మించాడు. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి రావడంతో వారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. గుండెకు ఆపరేషన్ చేయాలని అందుకు ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే కాని పసిప్రాణం నిలవదని చెప్పడంతో వారు కలవరపాటుకు గురైనారు. నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ చిరుద్యోగం చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటుండగా ఈ చికిత్సకు అంత ఖర్చు పెట్టే  స్థోమత లేక వారి కుటుంబం తల్లడిల్లిపోయారు. ఈ విషయం మంత్రి హరీశ్‌రావు దృష్టికి రావడంతో వారి కుటుంబాన్ని పిలిపించుకుని తానున్నానని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చి వారిలో ఆత్మస్థర్యాన్ని నింపి ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు గోపీచందుతో మాట్లాడారు. చిన్నారికి కావాల్సిన మెరుగైన వైద్యం అందివ్వాలని, ఎంత సహాయమైన తాను చేస్తానని, అంతేకాకుండా అవసరమైతే ప్రభుత్వ పరంగా చేయూతను అందిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 23న ఆ చిన్నారికి గుండె చికిత్స చేశారు. స్టార్ ఆసుపత్రిలోని హృదయ ఫౌండేషన్ వారి సహకారంతో పాటు బాబుకు వైద్యం అందించి విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ఆదివారం సతీష్, ఉమారాణిలు పసి బాబుతో సహా మంత్రి హరీశ్‌రావు నివాసానికి వచ్చి బాబుకు పునర్జన్మనిచ్చి కాపాడారని, జీవితాంతం బుణపడి వుంటామని తెలిపారు. పసి హృదయానికి ప్రాణం పోసి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీశ్‌రావు మరోసారి జన హృదయుడని నిరూపించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles