Wednesday, March 22, 2023

మంత్రికోటకు బీటలు

- Advertisement -

cong

మన తెలంగాణ/తాండూరు: గత కొంత కాలంగా మంత్రి మహేం దర్‌రెడ్డికి కంచుకోటగా తాండూరు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌లో ఉన్న వర్గ విభేలతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గులాబీ తమ్ముళ్లు సిద్దమైయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెలలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర చేవేళ్ల నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 27న తాండూరులో బస్సు యాత్ర బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అదే రోజు టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలంతో పాటు తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ నేతలు ఈ పాటికే రేవంత్ రెడ్డి తో మంతనాలు జరిపారు. బస్సు యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. దీంతో తాండూరు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తల గనుంది. గత కొంత కాలంగా టిఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత పోరుతో మంత్రి మహేందర్‌రెడ్డి సతమవుతున్నారు. పెద్దేముల్ మండలంలో ఉన్న ఓ సీనియర్ నాయకుడి ఒంటెద్దు పోకడలతో విసుగు చెందిన టిఆర్‌ఎస్ నాయకులు కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అదే విధంగా తాండూరు మండలంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం రెండు వర్గాల ఏర్పడ్డ టిఆర్‌ఎస్ నాయకులు పార్టీని విడుతామని మంత్రి మహేందర్‌రెడ్డితో బహిరంగంగా హె చ్చరించారు. యాలాల మండలంలో ముందు నుంచి రెండు వర్గాలుగా ఉన్న టిఆర్‌ఎస్ ఓ వర్గం నేతలకు పార్టీలో విలువలేదని తేల్చి చెప్పారు. అయితే జడ్పి చైర్మన్ సునితారెడ్డి చర్చలతో సద్దుమణిగినా ఓ వర్గం పార్టీకి దూరంగా ఉంది. మరో పక్క ఎంపిపి పదవీపై అవిశ్వాసానికి సొంత పార్టీ ఎంపిటిసిలు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక బషీరాబాద్ మండలంలో పార్టీ సీనియర్‌లను పక్కన పెట్టి మంత్రి కేవలం ఒక్కరి కోసం మండలంలో పార్టీని నమ్ముకున్నారని ఆరోపణలు ఉ న్నాయి. తాండూరు పట్టణంలో సైతం పార్టీ సీనియర్లకు గుర్తింపు లేదని గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం గుర్తించక పోవడంతో టిఆర్‌ఎస్ పార్టీకి గట్టి దెబ్బతలిగింది. పార్టీలో అంతర్గత పోరును తమ వైపు తిప్పుకునేందుకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News