Home తాజా వార్తలు మొక్కలు నాటిన మంత్రులు

మొక్కలు నాటిన మంత్రులు

Ministers Participating in the Haritha Haram at Siddipet

సిద్దిపేట : సిద్దిపేటలో మంగళవారం ఒకరోజే 50 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జోగు రామన్న , ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 23 కోట్ల మొక్కలను నాటినట్టు మంత్రులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వారు విజ్ఞప్తి చేశారు. హరితహారం ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత పాలకులు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని వారు ధ్వజమెత్తారు భవిష్యత్ తరాల బాగు గురించి సిఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Ministers Participating in the Haritha Haram at Siddipet