Home తాజా వార్తలు పరిగి ఎమ్మెల్యేకు మంత్రుల పరామర్శ

పరిగి ఎమ్మెల్యేకు మంత్రుల పరామర్శ

KTRహైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో రెండు రోజుల క్రితం గాయపడి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిగి ఎమ్యెల్యే మహేష్ రెడ్డి మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఆయనకు అందుతున్న వైద్య సేవలను అడిగితెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు ఆకాంక్షించారు.

Ministers who have criticized Parigi MLA Mahesh Reddy