Tuesday, April 16, 2024

నర్సుపై సామూహిక లైంగిక దాడి.. మైనర్ సహా ముగ్గురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Minor amongst 3 arrested for nurse gangrape

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ లోని మహేంద్ర గఢ్ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఓ నర్సుపై నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు మహేంద్రగఢ్ లోని చిప్పచ్చిపై గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆస్పత్రిలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నలుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. దవాఖానా లోనే ఆమెను కట్టేసి సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ విషయం ఎవరికైతే చెబితే హత్య చేస్తామని బెదిరించారు. బాధితురాలు ఈ దారుణాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగం లోకి దిగి 17 ఏళ్ల మైనర్ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News