Home తాజా వార్తలు బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Minor boy rapes girl in Madannapet

మన తెలంగాణ/మాదన్నపేట్: పదిహేనేళ్ల బాలికపై ఓ పదహారేళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఐఎస్‌సదన్ డివిజన్‌లోని ఓ బస్తీలో ఉండే బాలిక(15) అదే ప్రాంతంలో ఉండే బాలుడు(16) తమ కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఇరు కటుంబాలు దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. కాగా బాలుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్ష చేసిన వైద్యులు ఐదు నెలల గర్భవతి గా గుర్తించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు బాలుడితో పాటు కుటుంబ సభ్యులను మందలించారు. రాజీకి ప్రయత్నం జరిగినా బాలిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకుని బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు. మలక్‌పేట్ ఎసిపి వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.