Home జాతీయ వార్తలు మైనర్ పై అత్యాచారం…

మైనర్ పై అత్యాచారం…

MINOR GIRL ALLEGEDLY KIDNAPPED AND GANGRAPED

బికనీర్: కదిలే కారులో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన  రాజస్థాన్ లోని బికనీర్ లో చోటు చేసుకుంది. అనంతరం నిందితులు భాదితురాలికి సంబంధిచిన అభ్యంతరకర ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిిన ప్రకారం.. జులైన 29న నిందితులిద్దరు సదరు బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. కదులుతున్న కారులో ఆమెపై అత్యాచారం జరిపి..ఆ తర్వాత రోడ్డు పక్కన వదిలిపెట్టి పోయారు. బాధితురాలి తల్లీదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపిసి సెక్షన్,ఎస్సి,ఎస్టి యాక్ట్ , పోస్కో యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఛాతర్ గఢ్ పిఎస్ ఎస్ఎచ్ వో వికాస్ బిష్ణోయ్ తెలిపారు.