Tuesday, September 26, 2023

ఘట్‌కేసర్‌లో మైనర్ బాలిక మృత‌దేహం ల‌భ్యం

- Advertisement -
- Advertisement -

minor girl Dead body found in Ghatkesar

ఘ‌ట్‌కేస‌ర్‌: హైదరాబాద్ నగర శివారులోని ఘ‌ట్‌కేస‌ర్‌ లో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పూర్తిగా కాలిపోయిన బాలిక మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ లభ్యమైన ఆధారాలతో ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతురాలు పోచారం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన స్రవంతిగా గుర్తించారు. బాలిక ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేసింది. యువతి శుక్రవారం అర్థరాత్రి తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిందని బాలిక తండ్రి తెలిపాడు. బాలిక ఆత్మహత్య చేసుకుందా..? ఎవరైనా హత్య చేశారా..? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆమెను హత్య చేసి, పోట్రోల్ పోసి తగులబెట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News