Sunday, May 19, 2024

పఠాన్ చెరువులో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Rape

 

సంగారెడ్డి: ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన పఠాన్ చెరువు, అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక చక్రపురి కాలనీలోని ఓ షాప్ వద్ద బాలికను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి దుండగులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు సమాచారం అందించడంతో సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు బాలిక ఆచూకీని తెలుసుకొన్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Minor Girl Gang Raped by 3 Men at Ameenpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News