Thursday, April 25, 2024

పుణేలో దారుణం: బాలికపై సంచార గ్యాంగ్‌రేప్..

- Advertisement -
- Advertisement -

Minor Girl Gang raped in Pune

పుణే: మహారాష్ట్రలోని పుణేలో 13 ఏండ్ల బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. గత నెల 31న బాలికను దుండగులు అపహరించుకు వెళ్లారు. పుణే రైల్వే స్టేష న్ వద్ద ఈ బాలిక తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉంది. ఆమెను గమనించిన ఓ ఆటో డ్రైవర్ కొద్ది సేపటి తరువాత బాలిక వద్దకు వెళ్లి రాత్రి అయిందని, ఇంటి వద్ద దింపుతానని తెలిపి ఆటోలో తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో తన స్నేహితులు కొందరిని పిలిపించుకుని, తనతో పాటు ఆటోలో వారిని తీసుకుని పట్టణం అంతటా తిరిగారు. మధ్యలో పలు ప్రాంతాలలో బాలికపై వీరు అత్యాచారం జరిపినట్లు, తరువాత బాలికను బస్సు స్టేషన్ వద్ద దింపి ముంబై వెళ్లే బస్సు పట్టుకుని వెళ్లాలని గదమాయించి పంపించినట్లు పోలీసు డిప్యూటీ కమిషనర్ నమ్రతా పాటిల్ తెలిపారు. తన కూతురు ఎంతకూ రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాలిక కోసం తాము గాలించినట్లు పుణేలోనే ఆమెను కనుగొన్నట్లు, వాంగ్మూలం రికార్డు చేసుకుని చికిత్సకు ఆసుపత్రికి తరలించినట్లు పాటిల్ చెప్పారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.

Minor Girl Gang raped in Pune

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News