Home తాజా వార్తలు నమ్మించి బాలికను తీసుకెళ్లాడు..ఆపై నరకం

నమ్మించి బాలికను తీసుకెళ్లాడు..ఆపై నరకం

Rape

సిద్ధిపేట: బాలికను నమ్మించి బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన తనకు పరిచయమున్న ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకెళ్లాడు. రాయవరం గ్రామానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న తిమ్మాపూర్ సమీపంలోని రాజీవ్ రహదారి పరిసర ప్రాంతానికి వెళ్లగానే ఆ యువకుడు తన ఇద్దరు మిత్రులకు ఫోన్ చేసి పిలిచాడు. అక్కడే ముగ్గురూ కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా యువకులు రాత్రంతా 12 గంటల పాటు బాలికపై ఆత్యాచారం చేశారు. బాధను తట్టుకోలేక ఆమె కేకలు వేస్తుంటే నోటిలో గుడ్డలు కుక్కి తీవ్రంగా కొట్టారు. తరువాత నడిరోడ్డుపై బాలికను పడేసి వెళ్లిపోయారు. కూతురు కనిపించట్లేదని వెతుకుతున్న తల్లిదండ్రులకు బాలిక అచేతన స్థితిలో కనిపించింది. దీంతో తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకెళ్లి అడగగా తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Minor girl gang-raped in Siddipet district