Friday, March 29, 2024

యజమాని దుర్మార్గానికి మైనర్ బాలిక బలి

- Advertisement -
- Advertisement -

Minor girl set on fire for resisting rape dies

ఖమ్మం: కామాందుడి చేతిలో హత్యాచారానికి గురైన మైనర్ బాలిక గురువారం రాత్రి మృతి చెందింది. అత్యాచారయత్నానికి ఒడిగట్టిన సంఘటనలో కామాంధుడిని ఎదురించి తనప్రాణాల మీదుకు తెచ్చుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఖమ్మం నగరంలో పార్శిబంధంలో నివసించే అల్లం సుబ్బారావు ఇంట్లో ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ళ మైనర్ బాలిక పనిచేస్తుంది. అయితే ఆ ఇంటి యజమాని కుమారుడు అల్లం మారయ్య (25)గత నెల19వ తేదిన తెల్లవారుజామున అత్యాచారయత్నానికి పాల్పడ్డగా అడ్డుకుంది. దీనికి అగ్రహించిన మారయ్య సదరు మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఈవిషయం బైటికి పొక్కకుండా నగరంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయించారు. ఈవిషయంపోలీసుల వద్దకు వెళ్ళకుండా సుబ్బారావు మైనర్ బాలిక తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5లక్షలు కోరగా కేవలం రూ.1.50లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పి అవి కూడాచెల్లించకపోవడంతో ఈవిషయం బైటికి పొక్కింది. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున్న ఆందోళన చేయడం వల్ల మైనర్ బాలికకు మెరుగైన వైద్యం చేయించేందుకు హైద్రాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.అప్పటికే 70శాతం కాలిన గాయాలతో పక్షం రోజులపాటు మృత్యువుతో పోరాడింది.రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్,రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటేల రాజేందర్ ప్రత్యేక శ్రద్ద తీసుకొనిహైద్రాబాద్‌లోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తుండగా గురువారం రాత్రి మృతి చెందింది.

ఈకేసులో నిందితుడు అల్లం మారయ్యను ఈ నెల 6నపోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపించారు.మారయ్యే తనపై అత్యాచారయత్నానికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించారని మృతురాలు ఖమ్మం జిల్లా మొబైల్ కోర్టు జడ్జీకి మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.బాధితురాలి తండ్రి మోతే ఉప్పలయ్య ఖమ్మం నగరంలో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటనలో మెడికో లీగల్ చట్టానికి విరుద్దంగా వైద్యం చేసిన పూజా ప్రయివేట్ ఆస్పత్రిని జిల్లా వైద్య శాఖాధికారులు సీజ్ కూడా చేశారు.నిందితుడు భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News