Friday, April 19, 2024

మైనర్ బాలికపై హత్యాచారం

- Advertisement -
- Advertisement -

Minor girl suspicious died in Mahabubabad

మానుకోట జిల్లాలో దారుణం
నిందితులను శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్‌పి కోటిరెడ్డి

మన తెలంగాణ/మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దారుణ సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు వివరాలిలా ఉన్నాయి. మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపురం తండాకు చెందిన మోడు ఉష (17) అనే గిరిజన విద్యార్థిని మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుకుంటుంది. ఇంట్లో ఉన్న ఉష తండాలోని కిరాణం దుకాణానికి పోయి వస్తానని చెప్పి ఎంతకు తిరిగి రాకపోవడంతో ఆమె జాడ కోసం వెతకగా సమీపంలోని గుట్టలపై ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి మరిపెడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం మానుకోట ఏరియాసుపత్రికి తరలించారు.

ఈ మేరకు మృతురాలు తల్లి,దండ్రులుఇచ్చిన ఫిర్యాదు మేరకు తండాకు చెందిన ధరంసోతు రాజేష్ అనే యువకుడితో పరిచయం ఉండగా అతడే అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడి ఆపై హత్యకు పాల్పడి ఉంటాడని పేర్కొంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. కాగా ఆయన పోలీసులతో కలసి ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ మేరకు రాజేష్ అనే యువకుడితో యువతి శనివారం ఉదయం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు ఆయన వివరించారు. మృతురాలు మైనర్ కావడం వల్ల నిందితుడిపై పోక్సో యాక్టుతో పాటు ఐపీసీ 302, 376 సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తామని ఎస్పీ తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లో వదలం : మంత్రి సత్యవతి
అమాయకురాలైన గిరిజన బాలికపై అఘాయిత్యానికి పాల్పడమే గాక ఆపై హత్యకు పూనుకున్న నిందితుడిపై కఠినంగా శిక్షిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్నారు. బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎంపీ మాలోతు కవిత ఉషపై దారుణం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు.

మంత్రి ఎర్రబెల్లి సీరియస్
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అత్యాచార,హత్య ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్ అయ్యారు. గిరిజన యువతి పాశవికంగా హత్య చేసిన విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి జిల్లా ఎస్‌పి, కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

Minor girl suspicious died in Mahabubabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News