Home Elections 2018 మైనార్టీల సంక్షేమం కోసం కృషి : కెటిఆర్

మైనార్టీల సంక్షేమం కోసం కృషి : కెటిఆర్

Minority Blessing Cermany for TRS

హైదరాబాద్ : మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. శేరిలింగంపల్లిలో ఆదివారం మైనార్టీ ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు హాజరైన కెటిఆర్ మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోని మైనార్టీల కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెండు వేల కోట్లను కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. కుట్రల కూటమి ఎన్ని గిమ్మిక్కులు చేసిన, తిరిగి టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికార దాహంతో ఓట్ల కోసం వస్తున్న మహాకూటమి నేతలకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, టిఆర్‌ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ, పలువురు టిఆర్‌ఎస్ నేతలు , మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Minority Blessing Cermany for TRS