Home తాజా వార్తలు రాష్ట్ర మైనారిటి కమిషన్ కేసుల విచారణ

రాష్ట్ర మైనారిటి కమిషన్ కేసుల విచారణ

Minority Commission case

 

హైదరాబాద్: రాష్ట్ర మైనారిటి కమిషన్ శనివారం మూడు కేసులను విచారించింది. కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖముర్రుద్దీన్ అధ్యక్షతన విచారణలు జరిగాయి. ఈ మేరకు కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో యాకుత్‌పూరాకు చెందిన ఇబ్రహిం అన్సారీ, మీర్ హసన్ అలీఖాన్‌లు వివాహా సందర్భంగా రిజ్వానా బేగం భర్త మహ్మద్ ఖాన్ యాకుత్‌పూరాతో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా చెల్లించిన రూ.4లక్షల, ఒప్పందం పై జరిగిన వివాదం కేసు విచారణలో కమిషన్ ఇరు పక్షాల వాదనలను అలకించింది. ఈ మేరకు కేసు విచారణ 21డిసెంబర్ 2019కి వాయిదా వేసింది.

అలాగే వికారాబాద్ జిల్లాలోని ధరూర్ గ్రామంలో పట్టా భూ వివాదం పై కమిషన్ వాదనలను అలకించింది. పాత, కొత్త సర్వే నెంబర్‌ల మూలంగా రికార్డుల్లో పేర్ల విషయం పై కమిషన్ విచారణ జరిపి, ఈ కేసు విచారణను 21 సెప్టెంబర్ 2019కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా అంబర్‌పేట్ మెథడిస్టు చర్చి కార్యనిర్వహక కమిటి పలు అక్రమాలపై కమిషన్ విచారణ జరిపింది. ఈ కేసులో పూర్తి విచారణకు కార్యదర్శికి నోటిసులను జారీ చేయాలని అదేశించగా, ఈ కేసును 21సెప్టెంబర్ 2019 నాటికి వాయిదా వేసింది. మైనారిటి కమిషన్ కేసుల విచారణలో రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ శంక్‌లూక్, సభ్యులు మహ్మద్ ఫారుఖీ అలీఖాన్, బాసిత్, ఖద్దీర్ సిద్దీఖీ తదితరులు పాల్గొన్నారు.

Minority Commission case hearing adjourned to Dec 21