Home సంగారెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి

Minster Harish Rao Traveled

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నేటి రాజకీయాల్లో చాలా అరదుగా జరుగుతుంది. కేవలం ఒక్క రోజులోనే  తన మాటను నిలబెట్టుకొని రాష్ట్రనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గురువారం హత్నూర మండలంలో పర్యటించిన సమయంలో చెక్‌డ్యాంలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో సిఎం కెసిఆర్ ఈ చెక్ డ్యామ్‌లకు సంబంధించి ప్రకటన చేశారు. ఆ ప్రకారం శుక్రవారం నాడు ఆ చెక్‌డ్యామ్‌లను మంజూరు చేయడమే కాకుండా ఏకంగా ఉత్తర్వులు కూడా జారీ చేయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో హత్నూర మండలం నావాపేట్ చెక్‌డ్యామ్ నిర్మాణానికి 3671 ఎకరాలకు గాను రూ.785 లక్షలు, పన్యాల చెక్‌డ్యామ్‌కు చెక్‌డ్యామ్ నిర్మాణానికి 2202 ఎకరాలకు గాను 781.50 లక్షలు, చిలిపిచేడ్ మండలం చండూర్ మంజీరా చెక్‌డ్యామ్ నిర్మాణానికి 2139 ఎకరాలకు గాను రూ.816 లక్షలు, అజ్జమర్రికి 4615 ఎకరాలకు గాను 868.30లక్షలు, కొల్చారం మండలం చెక్‌డ్యామ్ నిర్మాణానికి 3146 ఎకరాలకు గాను రూ.960.50లక్షలు, ఎనగండ్లకు 2932 ఎకరాలకు గాను 958 లక్షలు,పైతరకు 3020 ఎకరాలకు గాను 977లక్షలు, సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి 450 ఎకరాలకు గాను 155లక్షలు, వెండికోల్‌కు 1258 ఎకరాలకు గాను 665 లక్షలు,తూప్రాన్‌కు 220 ఎకరాలకు గాను 150లక్షలు, యావాపూర్‌కు 260 ఎకరాలకు గాను 150లక్షలు, అలాగే వెల్దుర్తి మండలంలో దామరంచ గ్రామంలో  390ఎకరాలకు గాను 322.80లక్షలు, ఉప్పలింగాపూర్‌లో 480 ఎకరాలకు గాను 282.50లక్షలు, వెల్దుర్తిలో 430 ఎకరాలకు గాను 322.50లక్షలు మంజూరైనట్లు తెలిపారు. మొత్తం 14 చెక్‌డ్యామ్‌లకు రూ.81,94,10,000 కోట్లు మంజూరు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.