Friday, April 19, 2024

టమాట 100, మిర్చి 120

- Advertisement -
- Advertisement -

Mirchi and Tomato

 

కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు
లాక్‌డౌన్ ముసుగులో దోచుకుంటున్న వ్యాపారులు
నిత్యావసరాలకు ఇబ్బందిపడ్డ జనం, పలుచోట్ల క్రమశిక్షణ పాటించిన వ్యాపారులు, ప్రజలు
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : తలసాని

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. రాష్ట్రంలోనూ విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన దరిమిలా నిత్యా వసరా లు, కూరగాయల ధరలకు అమాం తం రెక్కలొచ్చాయి. ఈ నెల ౩1 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో నిత్యా వసరాలు, కూర గాయలను కొ నుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమతమ ప్రాంతాల్లో కిరాణా, కూరగాయల దుకాణాలతో పాటు రై తు బజార్ల వైపు పరుగులు దీశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిర్మల్ ఆదిలాబాద్‌లలో రైతు బజార్లు జనంతో కిటకిటలాడాయి. ఊహించని రీతిలో ప్రజలు తరలిరావడంతో వ్యాపారులు నిత్యావసరాలు, కూరగాయలను తమ ఇష్టాను సారంగా పెంచేశారు. ఆదివారం నాడు జనతా కర్ఫూ విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలు ప్రభుత్వం తదుపరి ప్రకటించిన లాక్‌డౌన్ పట్ల అంతగా స్పందించలేదు. కుటుంబం నుంచి ఒకరు రావాలన్న నిబంధన అమలులో వున్నా అది పాటించిన దాఖలాలు కనిపించలేదు.

రాఫ్ర ్టవ్యాప్తంగా ఆయా దుకాణాలు, రైతు మార్కెట్లు జన సంద డితో కిటకిటలాడాయి. లాక్‌డౌన్ సందర్భంలో అవి దొరకవేమోనన్న ఆందోళనతో ప్రజ లంతా ఒక్కసారిగా తరలివచ్చి వారానికి సరిపడేవన్నీ ఒకే సారి తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ విధంగా ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడ్డారు. అటు నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ చేసి విక్రయించిన వ్యాపారులు, కూరగాయల ధరలను మాత్రం అమాంతం పెంచేశారు. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా రూ.8కు లభించగా, నేడు అదే టమాటాను దాదా పుగా రూ.100 రూపాయలకు, కిలో రూ.15 రూపాయలు ఉన్న వంకాయను రూ.80కి, కిలో రూ.25గా ఉన్న మిర్చిని రూ.90120కి విక్రయించారు. బెండ, దొండ కిలో రూ.60, క్యారెట్, క్యాప్సికంను కిలో రూ.80కి విక్రయించి తమ జేబులు నింపుకున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న అధికారుల హెచ్చరికలను వ్యాపారులు పట్టించు కున్న దాఖలాలు తక్కువనే చెప్పొచ్చు.

ఇటీవలే యధాతధస్థితికి చేరిన ఉల్లిపాయ ధరలను సైతం వ్యాపారులు అమాంతం పెంచేశారు. ఉల్లి సైతం కిలో రూ.50పైనే విక్రయించడం గమనార్హం. ఎవరూ కొనని కాకరకాయ రేటు సైతం ఈ సందర్బంగా కిలో రూ.90కి విక్రయించడం కొస మెరుపు. ఈ సందర్భంలో ప్రజలంతా ఒకే ప్రాంతంలో సామూహికంగా పోగయ్యారు. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రక టించిన తరుణంలో ప్రజలు ఈ విధంగా ఒక్క సారిగా బయటకు రావడం వల్ల లాక్‌డౌన్ ప్రకటన వల్ల ఒనగూరే ప్రయోజనం ఏముందన్న వాదన సైతం బలంగా వినవచ్చింది. కేంద్రం సైతం ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలను సునిశితంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. అత్యవసరాలు మిన హాయించి ప్రజలెవరూ బయటకు రావొద్దని, కుటుంబం నుంచి ఒక్కరే రావాలన్న నిబంధనను తప్ప నిసరిగా పాటించాలని రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ప్రజలంతా ఇళ్లల్లోనే గడిపే విధంగా అధికారులు మరో వైపు చర్యలకు ఉపక్రమించారు.

కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయనిర్భంధంలో ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి జివో 45లో ఉన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి అధికారులు స్వయంగా రంగం లోకి దిగారు. ప్రజలంతా సామూహికంగా గుమిగూడని విధంగా ఆయా కిరాణా, కూరగాయల దుకాణాలు, రైతు మార్కెట్ల వద్ద చర్యలు తీసు కున్నారు. కొన్ని చోట్ల రౌండు మార్క్‌వేసి మరీ ప్రజలను ఆయా వస్తువులను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టడం గమనార్హం. అదే క్రమంలో ప్రజ లు రోడ్లపై తిరుగాడటం, గుమిగూడటం వంటి వాటిని కూడా నిరోధించే విధంగా చర్యలను వేగవంతం చేశారు. అత్యవసర సర్వీ సులు మినహా ఎవరినీ రోడ్లపై సంచరించేందుకు వీలు లేకుండా అధికారులు చర్యలు ప్రారంభించారు. పనీపాట లేకుండా వాహనాలపై రోడ్లపైకి వచ్చిన వాహన చోదకులను నిలువరించి భారీ మొత్తంలో జరిమానాలను అధికారులు విధించారు.

నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : మంత్రి తలసాని
నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను అదునుగా చేసుకుని వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి, ధరలను పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల ౩1 వరకు లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఎవరైనా వ్యాపారులు అధిక ధరలకు విక్రయాలు జరిపితే నిత్యావసర వస్తువుల చట్టం, ఇతర చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఎమ్మార్పీని మించి నిత్యావసరాలను విక్రయిస్తే.. డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించి ఇండ్లలోనే ఉండి కరోనా నిర్మూలనకు సహకరించాలని కోరారు.

 

Mirchi and Tomato rates are hiked
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News