Saturday, April 20, 2024

హీరో సాయిధరమ్‌కు తప్పిన ముప్పు

- Advertisement -
- Advertisement -

Missed threat to hero Sai Dharam Tej

స్పృహలోకి వచ్చాడని అపోలో వైద్యుల ప్రకటన
విరిగిన కాలర్ బోన్,
వెంటిలేటర్‌పై చికిత్స
హైదరాబాద్ తీగల వంతెన
సమీపంలో జరిగిన బైక్
ప్రమాదంలో గాయాలు

l 48 గంటలపాటు వెంటిలేటర్‌పై చికిత్స
l కాలర్‌బోన్ ఫ్యాక్చరైంది : అపోలో ఆస్పత్రి వైద్యులు
l ఘటనపై జిహెచ్‌ఎంసి, సాయిధరమ్‌లపై పోలీసుల కేసు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తీగలవంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సినీ హీరో సాయిధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో శనివారం నాడు కోలుకుంటున్నారు. ఈ ప్ర మాద జరిగిన వెంటనే అపస్మార స్థితిలో ఉన్న సాయిధరమ్ తేజ్‌ను 48గంటల పాటు వైద్యులు పర్యవేక్షణలో ఉండాలని, ప్రస్తుతం స్పృహలోకి వచ్చాడని వైద్యులు వివరిస్తున్నారు. స్పోర్ట్ బైక్ వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా బైక్ అదుపుతప్పడంతో తల, కుడి కంటి పైభాగంలో గా యాలయ్యాయని, ఈక్రమంలోనే అతని కాలర్‌బోన్ సైతం ఫ్యాక్చర్ అయినట్లు వై ద్యులు వెల్లడిస్తున్నారు.

సాయితేజ్ శరీరం లో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కా లేదని, కాలర్‌బోన్ విరిగిందని పేర్కొన్నా రు. ఆయన ఇంకా 48 గంటల పాటు వై ద్యుల పర్యవేక్షణలో ఉండాలని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చె ప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉం దని, తప్పనిసరిగా కోలుకుంటాడని అపో లో వైద్యులు పేర్కొంటున్నారు. కాగా ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకు న్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదం సమయంలో సా యిధరమ్ తేజ్ హెల్మెట్ ధరించి ఉండడం తో తలకు ఎలాంటి గాయాలు కాలేదని అపోలో వైద్యులు పేర్కొంటున్నారు. ప్ర మాద సమయంలో ఆయన ఛాతి భాగం రోడ్డుకు బలంగా తగిలి రాసుకుపోవడం తో దెబ్బలు తగిలాయని, దీంతో శ్వాస సంబంధ సమస్యలు రాకుండా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

తేజ్‌ను పరామర్శించిన తలసాని

రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయిధరమ్ తేజ్‌ను సినీఫ్రొటోగ్రాఫీ మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పరామర్శించాడు. అలాగే తేజ్‌కు చికిత్స చేస్తు న్న వైద్యులను పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్ తేజ్‌ను త్వ రగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సినీనటుడు నరేష్ మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ తన బిడ్డలాంటి వాడని, తను తర్వగా కోలుకోవాలన్నాడు. తన కుమారుడు నవీన్‌విజయకృష్ణ, సాయిధరమ్‌తేజ్ స్నేహితులని, శుక్రవారం రాత్రి వారు తమ ఇంటి నుంచే బయటకు బయలు దేరారని చెప్పా డు. సాయిధరమ్‌తేజ్ పెద్దల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి అని సినీనటి విజయశాంతి అన్నారు.

జిహెచ్‌ఎంసిపైనా కేసు నమోదు

హీరో సాయిదధరమ్ తేజ్ నిర్లక్షంగా 72 కిలోమీటర్ల స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని రాయదుర్గం పోలీసులు శనివారం నాడు అతనిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా రోడ్డుపై ఉ న్న ఇసుక తొలగించకుండా నిర్లక్షంగా వ్యవహరించిన జిహెచ్‌ఎంసి అధికారుల పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సాయిధరమ్‌పై నిర్లక్షపు, ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు ఐపిసి 336, 184 ఎంవి యాక్ట్ కింద కేసు న మోదు చేసినట్లు ఇన్స్‌స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

ఆస్పత్రికి క్యూకట్టిన ప్రముఖులు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ చూసేందుకు కుటుంబ సభ్యు లు, అభిమానులు, సినీ ప్రముఖులు శనివారం నాడు అపోలో ఆస్పత్రికి క్యూ కట్టా రు. ముఖ్యంగా చిరంజీవి దంపతులు, రాంచరణ్, ఉపాసన తదితరులు అపోలో హాస్పిటల్‌కు చేరుకుని సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సినీ నటి రాశీఖ న్నా అపోలో వద్ద తేజ్ ఆరోగ్య పరిస్థితి గు రించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బైక్ కల్చర్‌కు వ్యతిరేకంగా సినీ పెద్దల నిర్ణయం

సినీ రంగానికి చెందిన బాబుమోహన్, కో టా శ్రీనివాసరావుల కుమారులు సైతం బై క్ ప్రమాదంలో మరణించారని, ఈక్రమం లో సినీ యువ హీరోలు స్పోర్ట్ బైక్‌లు, కార్ల వాడకంపై నిషేధం విధించాలని టా లీవుడ్ సినీ పెద్దలు తీర్మానం చేయనున్న ట్లు తెలిసింది. యువహీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్‌పై నుంచి పడి ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ పె ద్దలంతా కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బైక్ కల్చర్‌కు వ్యతిరేకం గా తీర్మానం చేసేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలవనున్నట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News