Thursday, April 25, 2024

మౌంట్ అన్నపూర్ణపై మాయమైన పర్వతారోహకుడు లభ్యం

- Advertisement -
- Advertisement -

 

కాట్మండు: మౌంట్ అన్నపూర్ణ అధిరోహించే ప్రయత్నంలో లోతైన లోయలో జారిపడిన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మలూ సజీవంగా లభించినట్లు అధికారులు గురువారం ధ్రువీకరించారు. ప్రపంచంలోని పదవ ఎత్తయిన శిఖరమైన మౌంట్ అన్నపూర్ణకు చెందిన క్యాంప్ 3కి దిగువన లోయలో పడిపోయిన 34 ఏళ్ల పర్వతారోహకుడు అనురాగ్‌ను సహాయక బృందం సజీవంగా కాపాడినట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్‌కు చెందిన తానేశ్వర్ గురగైన్ తెలిపారు. అయితే అనురాగ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, పోఖరాలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో అనురాగ్‌ను కలుసుకున్న తర్వాత ఆయన సోదరుడు సుధీర్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

క్యాంప్ 2 నుంచి దిగుతూ 5,800 మీట్ల పైనుంచి లోయలో పడిపోయిన అనురాగ్ సోమవారం నుంచి కనిపించకుండా పోయారు. కాగా..ఛాంగ్ దావా సారథ్యంలోని ఆరుగురు షెర్పా పర్వతారోహకుల బృందం అనురాగ్ కోసం గాలింపు చేపట్టింది. బుధవారం ఆయన 300 మీటర్ల లోతైన లోయలో సజీవంగా లభించినట్లు తెలుస్తోంది. అనురాగ్ ఆచూకీని కనిపెట్టేందుకు సహాయపడవలసిందిగా కోరుతూ అనురాగ్ కుటుంబ సభ్యులు, మిత్రులు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌కు ఒక లేఖ కూడా రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News