Home తాజా వార్తలు ఫ్యామిలీ అంతా చూసేలా…

ఫ్యామిలీ అంతా చూసేలా…

Missing Telugu Movie

 

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మిస్సింగ్. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. మిస్సింగ్ చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. గురువారం చిత్ర ప్రమోషనల్ సాంగ్ ఖుల్లమ్ ఖుల్లాను ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో హర్షా నర్రా మాట్లాడుతూ “ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. కమర్షియాలిటీ కోసం అడల్ట్ సీన్స్, ఇతర అంశాలు సినిమాలో ఉండవు”అని అన్నారు. హీరోయిన్ నికీషా మాట్లాడుతూ “ఈ సినిమాలో మిస్ అయ్యేది నేనే. నాకోసం హీరో సహా మిగతా వాళ్లంతా సెర్చ్ చేస్తుంటారు. సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మిషా నారంగ్, అశోక్ వర్థన్ పాల్గొన్నారు.