మన తెలంగాణ/గజ్వేల్ : కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎమ్‌ఒఇఎఫ్ సెక్రెటరీ సికె.మిశ్రా ఐఎఎస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పంపింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు గజ్వేల్ పరిధిలోని వివిధ గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేసే విధానాన్ని వివరించారు. మిషన్ భగీరథ హెడ్ పంపు, ఫోటో ఎగ్జిబిషన్, మిషన్ భగీరథ ఫైలాన్‌ను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ ప్రయత్నం అద్భుతం, రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు అమోఘమని ప్రశంసించారు. ఓ వైపు అడవులను కాపాడుకుంటూనే సాగు, తాగు నీటి ప్రాజెక్ట్‌లు చేపట్టడం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు ఆర్‌డబ్లూఎస్ మిషన్ భగీరథ ఇంజనీర్ బి.సురేందర్‌రెడ్డి, ఇరిగేషన్ సెక్రెటరీ ఎస్‌కె.జోషి, ఐఎఫ్‌ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పికె.జాన్, జెసి పద్మాకర్, గడా అధికారి ఎం.హన్మంతరావు, ఆర్‌డబ్లూఎస్ సిద్దిపేట్ జె.చక్రవర్తి, ఆర్‌డబ్లూఎస్ ఇఇ సిద్దిపేట్ ఎం.శ్రీనివాసచారి, ఇఇ ఎంబి.గజ్వేల్ టి.రాజయ్య, డిఎఫ్‌ఒ సిద్దిపేట్ శ్రీధర్‌రావు, నగరపంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ తహసీల్దార్ నిర్మల, నాగార్జున తదితరులు పాల్గొన్నారు
మిషన్ భగీరథ ఓ అద్భుతం
- Advertisement -
- Advertisement -