Home తాజా వార్తలు పంద్రాగస్టుకు బల్క్ నీరు

పంద్రాగస్టుకు బల్క్ నీరు

Mission Bhagiratha, already waterfowl to 18,000 villages

పూర్తి కావచ్చిన మిషన్ భగీరథ, ఇప్పటికే 18 వేల గ్రామాలకు చేరుకున్న జలనిధులు
8 వేల గ్రామాల్లో ఇళ్లకు అందుతున్న మంచినీరు, దీపావళికి ప్రతి ఇంటికీ 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లుగా ఈ నెల 14వతేదీ అర్ధరాత్రికి నిర్దేశిత లక్షం మేరకు రాష్ట్రంలోని 24,225 గ్రామాలకు మిషన్ భగీరథ బల్క్ నీరు చేరుతుంది. ఇప్పటివరకు 18వేల గ్రామా ల వరకు చేరుకున్నది. మరి 6,225 గ్రామాలకు బల్క్‌నీరు చేరుకునే పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. 18వేల గ్రామాల్లోని 8వేల గ్రామాల్లో ఇంటింటికి మంచినీరు అందుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో పనులన్నీ దాదాపుగా పూర్తికాగా, మిగిలిన వాటిలో 95 శాతం పైగా పనులు పూర్తయ్యాయి.

భగీరథ లక్షం : రాష్ట్రంలోని 26 సెగ్మెంట్లు, 99 నియోజకవర్గాల్లోని 24,225 గ్రామాలకు, 65 పట్టణ స్థానిక సంస్థలకు శుద్ధిచేసిన మంచినీరును అందించడం. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.43,791కోట్లు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ లక్షం ప్రకారం మొత్తం ఇళ్ల సంఖ్య 52,42,225. ఇందులో పట్టణ ప్రాంతంలో 12,82,548 ఇళ్ళు.
2.17 కోట్ల మంది గ్రామీణులకు, 54.51లక్షల మంది పట్టణ ప్రజలకు త్రాగునీరందించడం.
దీని కోసం 19 ఇంటేక్ నిర్మాణాలు, 50 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, 1386 సంపులు,జిఎల్‌బిఆర్, ఒహెచ్‌బిఆర్ భారీ ట్యాంకులు నిర్మించాలి.
గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా కోసం కొత్తగా 18,515 ఒహెచ్‌ఎస్‌ఆర్ నీటి ట్యాంకులు నిర్మించాలి. 1165 పంప్‌సెట్లు ఏర్పాటు చేయాలి.
7) నీటి సరఫరా కోసం 235మెగావాట్ల విద్యుత్‌ను అందించాలి. దీని కోసం కొత్తగా 164హెచ్‌టి కనెక్షన్లు, రెండు 220కెవి సబ్‌స్టేషన్లతో పాటు 33/11కెవి సబ్‌స్టేషన్లు 42, 11కెవి సబ్‌స్టేషన్లు 120 ఏర్పాటుచేయాలి. ఎల్‌టి కనెక్షన్లు 253 ఇవ్వాలి.
8) నీటి సరఫరా కోసం మొత్తం 92,798కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు వేయాలి.

నీటి ఏర్పాట్లు నిర్దేశిత లక్షం మేర భగీరథ ద్వారా త్రాగునీరందించడానికి 59.94టిఎంసీల నీరు అవసరం. దీని కోసం కృష్ణా బేసిన్ నుంచి 23.44టిఎంసీలు, గోదావరి బేసిన్ నుంచి 32.58 టిఎంసీలు కేటాయించారు. మిగిలిన 0.92టిఎంసీల నీటిని ఇతర జలవనరుల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ఆయా బేసిన్ల కింద ఉన్న రిజర్వాయర్లు, చెరువుల్లో, ప్రాజెక్టుల్లో తప్పనిసరిగా నిల్వ ఉంచాల్సిన నీటి నిల్వలను నిర్ధారించారు. నిర్దారించిన నీటి నిల్వకంటే ఎక్కువ నీరు ఉంటే దానిని మాత్రమే సాగునీటి అవసరాలకు వాడాలని ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు కృష్ణా బేసిన్‌లోని పాలేరు రిజర్వాయర్ నుంచి 4.70 టిఎంసీలను కేటాయించారు.

ఎకెబిఆర్ రిజర్వాయర్ నుంచి 1.35టిఎంసీలు, వైరా నుంచి 1.28టిఎంసీలు, పిడి.పల్లి 0.12టిఎంసీలు, పెందిపాకల నుంచి 0.90టిఎంసీలు, ఉదయసముద్రం నుంచి 2.59టిఎంసీలు, కోలీసాగర్ నుంచి 1.365టిఎంసీలు, జూరాల నుంచి 1.22టిఎంసీలు, రామన్‌పాడు నుంచి 1టిఎంసీ,గోపాలదిన్నే నుంచి 0.05టిఎంసీలు, శంకరసముద్రం నుంచి 0.315టిఎంసీలు, రంగసముద్రం నుంచి 0.1టిఎంసీలు, సుంకేశుల నుంచి 0.14టిఎంసీలు, , యెల్లోర్ నుంచి 7.12టిఎంసీలు, నుంచి 2టిఎంసీలు కేటాయించారు. గోదావరి బేసిన్‌లోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి 0.55టిఎంసీలు, స్వర్ణ ప్రాజెక్టు నుంచి 0.08టిఎంసీలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 6.50టిఎంసీలు, కడెం నుంచి 0.28టిఎంసీలు, కొమురంభీం నుంచి 1.77టిఎంసీలు, ఎల్లంపల్లి నుంచి 2.82టిఎంసిలు, మేడారం నుంచి 0.18టిఎంసీలు, మిడ్‌మానేరు నుంచి 1.41టిఎంసీలు, లోయర్ మానేరు నుంచి 6.16 టిఎంసీలు, భీంఘన్‌పూర్ నుంచి 0.37టిఎంసిలు, ధర్మసాగర్ నుంచి 1.03టిఎంసీలు, సాలివాగు నుంచి 0.47టిఎంసీలు, రామప్పలేక్ నుంచి 0.24టిఎంసీలు, ములుగుఘన్‌పూర్ నుంచి 0.69టిఎంసీలు, కిన్నెరసాని నుంచి 0.45టిఎంసీలు, అలీసాగర్ నుంచి 0.82టిఎంసీలు, బల్లాల్ నుంచి 0.18టిఎంసీలు, చిట్టకోడూర్ నుంచి 0.17టిఎంసీలు, సింగూర్ నుంచి 5.70టిఎంసీలు కేటాయించారు. మొత్తం 36 రిజర్వాయర్ల నుంచి ఈ నీటి కేటాయింపులు జరిపారు.
పూర్తయిన పనులు
1) 19 ఇంటేక్ నిర్మాణాలు
2) 50 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు
3)1386 మేజర్ నిర్మాణాలు( వీటిలో సంపులు 425,జిఎల్‌బిఆర్ 149, ఒహెచ్‌బిఆర్ 566లు ఉన్నాయి)
4) 92,798కిలోమీటర్ల పైప్‌లైన్( 48,923కిలోమీటర్ల నీటి సరఫరా పైప్‌లైన్, 43,875కిలోమీటర్ల నీటి పంపిణీ పైప్‌లైన్)
5) 1165 పంప్‌సెట్లు ఏర్పాటు
6) గ్రామాల్లో నీటి నిల్వచేసి ఇళ్లకు పంపిణీ చేసేందుకు నిర్మించాల్సిన మొత్తం 18,515ఒహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్‌లను నిర్మించాల్సి ఉండగా వీటిలో 60శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలినవి దీపావలి లోపు పూర్తి చేయనున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
7) 164హెచ్‌టి కనెక్షన్లు, రెండు 220కెవిసబ్‌స్టేషన్లు, 33/11కెవి సబ్‌స్టేషన్లు 42, 11కెవి సబ్‌స్టేషన్లు 120, 253 హెచ్‌టి కనెక్షన్లు.
8) 235రైల్వే క్రాసింగ్‌లు, 505 జాతీయ రహదారి క్రాసింగ్‌లు, 1489 కెనాల్ క్రాసింగ్‌లు, 191 రివర్ క్రాసింగ్‌లు, 4382 ఆర్ అండ్ బి రోడ్ల క్రాసింగ్‌లు, 6094 గ్రామీణ రహదారుల క్రాసింగ్‌లు.